Showing posts with label poems. Show all posts
Showing posts with label poems. Show all posts

Thursday, July 23, 2026

నిలువగలమె తల్లి నీవె పరీక్షింప

సంకటములయందు శరణంటు వేడేము
అంబ నీవె మాకు అండయనుచు
నిలువగలమె తల్లి నీవె పరీక్షింప
కరుణ జూపుమమ్మ కనకదుర్గ

భావం: 

సంకటాలు వచ్చినప్పుడు నీవే మాకు అండ అని నిన్ను శరణు వేడుతాము. అలాంటి నీవే మమ్మల్ని పరీక్షిస్తే మేమెలా నిలువగలం తల్లీ? మాపై కరుణ చూపుమమ్మ కనకదుర్గా!

Sunday, December 24, 2023

శరణం కృష్ణ

 

శరణు శరణు కృష్ణ శరణు మనోహర

శరణు వాసు దేవ శరణు తండ్రి

శరణు కోరెద తవ చరణ కమలముల

శరణు భక్త వరద శరణు శరణు 


Thursday, December 21, 2023


తలువ మనసు నెంచి తలచుట మరచితిని

తలవ వలయు ననుచు తల్లి నిన్ను

తలుపు మరుపు యంత తవాధీనంబేగ

తలువ సాధ్యమవున తలచినంత 

Tuesday, July 18, 2023

కొలువు కొలువు అనుచు కోదండ పాణిని

 మనసు కోరుచుండె మరిమరి తలవంగ 

తన్మయత్వమునను తనను కొలువ

కొలువు కొలువు అనుచు కోదండ పాణిని

కోరిన కోర్కె తీర్చు కోసలేంద్రు

Sunday, June 26, 2022

హలము పట్టి వనిత పొలము దున్నె


                                                    చవట మొగని తోడ సంసారమెల్లక

                                                    చంటి బిడ్డ నెత్తి చక్కగాను

                                                    భారమైన కూడ  బడలిక యెరుగక

                                                     హలము పట్టి వనిత పొలము దున్నె

జన్మధన్య మవద జంట జూడ

కోమలాంగి సీత కోదండ పాణికి 

జరిగె పెండ్లితంతు జనకునింట

జగతి పతియె వరుడు జగన్మాతె వధువు

జన్మధన్య మవద జంట జూడ

Tuesday, August 31, 2021

జై శ్రీ కృష్ణ

సర్వ వ్యాపకుండు సర్వ సమర్థుండు

నళిన లోచనుండు నలుపు వాడు

కీర్తి గాంచినాడు కృష్ణ నామము తోడ

జగతినేలు వాడు జగతి వాడు.


జై శ్రీ కృష్ణ      జై జై శ్రీ కృష్ణ

Tuesday, August 17, 2021

మందుమాంసమవియె మర్యాదగా మారె

 మందు మాంస మిడగ మర్యాద యనబట్టె

పెట్టలేని వాణ్ణి తిట్టబట్టె

మందుమాంసమవియె మర్యాదగా మారె

మంచి మాటలెల్ల మంట గలిసె

Monday, May 17, 2021

కుంచెచెక్కిన లేమ

 కుందనపు లలామ కుంచెచెక్కిన లేమ

కుర్రకారు మదిని క్రుంగదీయ

వన్నెలన్ని కలిపి వగలు సెగలు జిమ్మె

ఊహలందుకూడ ఉండనీక

Monday, May 3, 2021

ఆనందమును పొందె

 రాజు కావలసిన రామచంద్రునిటుల 

దాసి మాట విని తల్లి కైక 

అడవి పాలు జేసి ఆనందమును  పొందె

కొడుకు రాజగుటను కోరుకుంటు

Wednesday, April 28, 2021

రమ్యమైన రామ రసము గ్రోలి

 రామరామ అంటు రామభక్త హనుమ

పరవశమున తాను పాట పాడ

పులకరించి పోయె మూడు లోకంబులు

రమ్యమైన రామ రసము గ్రోలి

Friday, April 23, 2021

బలము తెలుగు

 ఆంగ్లభాష నేర్చి ఆంధ్రంబు రాదంటు

అమ్మభాష త్రోసి ఆంగ్లమేల

బ్రతుకు ఆంగ్లమైన బలము తెలుగు నీకు

తెలుగు మరిచిపోకు తెలుగు వాడ !

పాడు చేయతగునా ?

 సకల సృష్టి యందు సత్వముండినదయ్యి 

సకల ప్రాణులకును స్వర్గమయ్యి 

ప్రాణమిచ్చు నవని పాడు చేయతగునా ?

బుద్ధి జీవులకును బుద్ధి లేద ?

Friday, April 9, 2021

నీరుగార్చె

నిష్ఠగుండ ఎంచి నిశ్చయంబు జేసితి 

దైవనామస్మరణ దలచి మదిని 

పాడు చింత ఒకటి మస్తిష్కములొ బుట్టి 

నిశ్చయంబునంత నీరుగార్చె 

ప్రాణమిచ్చు

ఎన్ని చీరలున్న ఎంతమంచివి యున్న 

చీరలల్ల పట్టు చీర వేరు 

పండగొచ్చెనంటె పట్టుబట్టు మగువ 

పట్టుచీరలన్న ప్రాణమిచ్చు

Friday, April 2, 2021

మనిషితరమ

చూసేదంత మాయ చూడలేనిది మాయ 

మనిషి బ్రతుకు మాయ మనిషి మాయ 

మాయాలోన పుట్టి మాయలో చచ్చినా 

మాయతెలుసుకొనుట మనిషితరమ? 

Thursday, April 1, 2021

వెకిలి నవ్వు నవ్వు

సెల్లు ఫోను ఒకటి జేబులోనుండిన 

సొల్లు కబురు జెప్పు స్టోరిలెన్నొ 

పక్కనున్న వాణ్ణి పక్కన పెట్టేసి 

వెకిలి నవ్వు నవ్వు వెర్రి జనులు

Monday, March 29, 2021

రొదను తీర్చెడి మందు

రోగమందు మనిషి రొదను తీర్చెడి మందు 

దైవమిచ్చినట్టి దండి మందు 

మత్తులోన ముంచి చిత్తు చేసెడి మందు 

మనిషి జేసినట్టి పాడు మందు

Tuesday, March 23, 2021

నిలిచిరవనియందు

దేశరక్షనందు దేహాన్ని వదిలేసి 

అమరులయ్యి నిలిచిరవనియందు 

నిలుపు మదిన వారి నిజమైన స్ఫూర్తిని 

మరవకుండ వారి త్యాగనిరతి

Wednesday, March 10, 2021

భక్తి తోడ

 


శివుని పూజ కొరకు శివరాత్రి రోజున 

నీలవేణి ఇటుల నీళ్లు తెచ్చె

ఆర్తి తొడ జేసె నభిషేక వ్రతమును  

భక్తితోడ కొలిచె  భైరవుడను 

నిలువగలమె తల్లి నీవె పరీక్షింప

సం కటములయందు శ రణంటు వేడేము అం బ నీవె మాకు అం డయనుచు ని లువగలమె తల్లి నీ వె పరీక్షింప క రుణ జూపుమమ్మ క నకదుర్గ భావం:  సంకటాలు వచ్చినప్పుడు న...