Wednesday, December 6, 2023

బోలాశంకరుడు

 


కాసిన్ని నీళ్లు చిలకరిస్తె నేమి 

కొన్ని పూలు మీద విసిరేస్తెనేమి

నా భక్తుడంటూ పొంగిపోయేవాడు

కోరకున్న వరములిచ్చేటివాడు

దేవతాసురుల బేధమెంచనివాడు

సకలప్రాణుల సమముగా చూచువాడు

మూడులోకంబులనేలేటి ఈశ్వరుడు

పిలిస్తే పలికేటి బోలాశంకరుడు!

No comments:

Post a Comment

నిలువగలమె తల్లి నీవె పరీక్షింప

సం కటములయందు శ రణంటు వేడేము అం బ నీవె మాకు అం డయనుచు ని లువగలమె తల్లి నీ వె పరీక్షింప క రుణ జూపుమమ్మ క నకదుర్గ భావం:  సంకటాలు వచ్చినప్పుడు న...